Friday, September 4, 2009
Monday, June 29, 2009
అస్తిత్వ సాహిత్యాలను ఎదగనివ్వడమే నేటి ప్రజాస్వామ్యం
గురజాడ, చలం, శ్రీశ్రీ శత జయంతి, వర్ధంతి కార్యక్రమాలను, సంస్మరణ ప్రత్యేక సంచికలను, ప్రత్యేక కథనాల ప్రసారాలను ముమ్మరం చేసారు. ఇదంతా రచనా రంగంలో ఆధిపత్య కులాల పెత్తనాలను కాపాడుకునే ప్రయత్నాలే! తెలుగులో అస్తిత్వ సాహిత్యాలు బలంగా ముందుకు సాగుతున్నాయి. మాదిగ, దళిత, ముస్లిం, దళిత క్రైస్తవ, తెలంగాణ, బిసి సాహిత్యాలు ఇందుకు నిదర్శనం. మాదిగ సాహిత్య వేదిక, దండోరా- మైసమ్మ- ఏకలవ్య ప్రచురణలు, గుంపు సాహితి, భాగ్యనగర్ బుక్‌ట్రస్టు లాంటి అనేక ప్రచురణ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇపుడు మరో అడుగు ముందుకుపోయి ఎస్సి ఎస్టి బిసి మైనారిటి రచయిత్రుల వేదిక 'మట్టిపూలు' పరిమళం మొదలైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ సాహిత్యం వస్తూనే ఉంది. ఈ సాంస్కృతిక పునర్జీవనం కోస్తాయేతర ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణ కేంద్ర బిందువుగా సాగుతోంది. అలాగే అణగారిన అన్ని సమూహాల్లో ఈ పునర్జీవనం ప్రారంభమయ్యింది. అణగారిన కులం జాతి-తెగ-జెండర్-మతం- భాష- ప్రాంతాలకు చెందిన చైతన్యంతో వస్తున్న రచనలవల్ల బ్రాహ్మణ,శూద్ర ఆధిపత్యకులాల గుత్తనాయకత్వం, పట్టు క్రమంగా తగ్గిపోతోంది. అస్తిత్వ సాహిత్వాల ప్రతిఘటన ను, సవాళ్లను ఆధిపత్యకుల రచయితలు, వారి అభిమాను లు జీర్ణించుకోలేకపోతున్నారు.స్వాగతించలేకపోతున్నారు. దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, బిసీల జీవితాలను స్పృశించని కోస్తా బ్రాహ్మణ రచయితలు గురజాడ, శ్రీశ్రీ, చలం మొదలగువారిని బహుజన సమూహాలన్నింటికి సాహిత్య ప్రతినిధులుగా రుద్దే కుట్రలు జరుగుతున్నా యి. అనేకానేక పరిమితులున్న వారిని ప్రగతిశీల, అభ్యుదయ, ఆధునిక, విప్లవ సమగ్రతల మహత్తులు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి గొప్పతనం 'అనంత'మైనద ని ఆధిపత్య కులాల రచయితలు అంటున్నారు. భవిష్యత్ తరాలకు కూడా సమకాలికుడు గురజాడ అనీ, ముద్దుల గురజాడ అని, కన్యాశుల్కం - శ్రీశ్రీ శత జయంతి సందర్భాన్ని 'ఒకే ఆకాశంలో రెండు పున్నము'లని, జీవజలం చలం అనీ పాళీలు అరిగిపోయేలా పొగడ్తలు రాసేస్తున్నారు. వీరి శత జయంతి, వర్ధంతి కార్యక్రమాలను, సంస్మరణ ప్రత్యేక సంచికలను, ప్రత్యేక కథనాల ప్రసారాలను ముమ్మరం చేసారు. ఇదంతా రచనారంగంలో ఆధిపత్య కులాల పెత్తనాలను కాపాడుకునే ప్రయత్నాలే! నేటికీ ఆధిపత్య కులాలే పురోహిత, విద్య, పరిపాలన, సాంస్కృతిక, ఆర్థిక వ్యవస్థలను నియంత్రిస్తున్నాయి. వారసత్వం, భూమి (ధనం), కులంతో సమాజంపై పట్టు నిలుపుకునే ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాయి. బహుజన సమూహాలపై సాంస్కృతిక దాడిని సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ఆధిపత్య కులాలు కొనసాగించే దుశ్చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అస్తిత్వ ఉద్యమాల సంరంభాన్ని తెరమరుగుపరచటానికి ఆధిపత్యకులాలరచయితలు వొడి గడుతున్నారు. అస్తిత్వ ప్రవాహాలను అప్రధానం, అదృ శ్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నారు. మాదిగ, ముస్లిం, తెలంగాణ, బహుజనవాద రచయితలను గందరగోళపరి చి అస్తిత్వవాదాలనుండి మరలించి సాహిత్య రాజకీయా ల్లో పాలేర్లు (కార్యకర్తలు)గా, కోవర్టులుగా ఉపయోగించుకుంటున్నారు. కొన్ని సాహిత్య వేదికల ఏర్పాటు ఇందులో భాగమే. అప్పారావు, శ్రీశ్రీ, చలంలకు ప్రగతిశీల, అభ్యుదయ, విప్లవ ముద్రలు వేసి, పరోక్షంగా బ్రాహ్మణ రచయితల్లో గొప్పతనం ఉందనిచెప్పే మోసం జరుగుతున్నది. బ్రాహ్మణ రచయితలు గొప్పవారని ప్రచారం చేసి, తర్వా తి వరసలో శూద్రాధిపత్య కులాల ఆధిక్యతలను సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో స్థాపించుకునే దుర్నీతి ఇది. 'మంచియన్నది మాలయైతే, మాల నేనగుదున్' అన్నా డు గురజాడ. అప్పారావు దృష్టిలో మాల మంచిదో కాదో సందేహంగానే మిగిలింది! కన్యాశుల్కం నాటకంలో రామ ప్ప పంతులు అనే బ్రాహ్మణ పాత్ర చేత అసిరిగాడు (దళితుడు) పాత్రని ఉద్దేశించి 'అపవిత్రం ముండాకొడుకు ఏవై నా తింటాడు. బ్రాహ్మలం పవిత్రమైనవాళ్లం గదా' అని కుల వివక్ష ప్రదర్శిస్తాడు. అప్పారావు నేడు బతికుంటే తీవ్ర విమర్శలను ఎదుర్కొని ఉండేవాడు. కాలం చెల్లిన, అమానవీయమైన కన్యాశుల్కం అభ్యుదయ నాటకమని కీర్తించే సాహిత్యాభిమాన శిఖామణులు రాజ్యాంగంలోని అధికరణం 17 అంటరానితనాన్ని నిషేధించిందని, కుల వివక్ష శిక్షార్హమైన నేరంగా గ్రహిస్తే మంచిది. బ్రాహ్మణ బాలిక పూర్ణమ్మ దయనీయస్థితి గురించి రాసిన అప్పారావు, దళిత పాత్ర అయిన అసిరిగాడికి గౌరవప్రదమైన పేరు పెట్టకపోవటం, మానవ హుందాతనం కల్పించలేకపోవ టం, ఆయనలోని బ్రాహ్మణ వివక్ష, అహంకారం కాదా? సాహిత్యయుగాన్ని ఇకపై నేను నడిపిస్తున్నానని గొప్ప లు పోయిన శ్రీశ్రీ కవిత్వంలో 'భూతాలు, యజ్ఞోపవీతా లు' వంటి హిందూ గ్రాంధిక వ్యాకరణ (బ్రాహ్మణ) శబ్దా లు చాలానే ఉన్నాయి. వ్యాకరణంలో చందోబద్దంగా బ్రాహ్మణ రచయితలే రాస్తారు. దానిని తోసిపుచ్చి శ్రీశ్రీ వంటి బ్రాహ్మలే చందస్సు సంకెళ్లని చట్ఫట్మని తెంచేస్తారు! సాహిత్యంలో గ్రాంధిక రచనా బ్రాహ్మణ్యమైనా, సరళ రచనా బ్రాహ్మణ్యమైనా వారి సొత్తేకాని, బహుజన రచయితల సొత్తు కాదని చెప్పే అహంకార ప్రదర్శన ఇది. ఏ గొప్ప ప్రాధాన్యత, విలువైనా బ్రాహ్మణులకే తప్ప బ్రాహ్మణేతర రచయితలకు కాదనే కుల వివక్ష కూలిపోవాల. ఆఫ్రికా ఖండంలోని 'హాటెన్ టాట్, జూలు, నీగ్రో' లు కనిపించిన శ్రీశ్రీకి రాజకీయ, మానవ హక్కులకోసం దేశంలో దళితులు చేసిన ఏ పోరాటమూ, ఉద్యమమూ కనిపించకపోవటం ఎంత ఆశ్చర్యం! కవితా వస్తువుగా శ్రీశ్రీకి దళిత జీవితం పనికిరాకపోవటం అమానుషం అనిపించడంలేదా? పోనీ, ఇది శ్రీశ్రీ పరిమితి అని అతని అభిమానులు వొప్పుకుంటారా? 'కసాయిబు' తిట్టు పద సృష్టి చేసినందుకు శ్రీశ్రీ అస్తిత్వ చైతన్యం కలిగిన నేటి ముస్లిం రచయితల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సిఉండేది. బ్రాహ్మణ, శూద్రాధిపత్య కులాల స్త్రీల స్వేచ్ఛని రచన ల్లో చిత్రించిన చలానికి బహుజన జెండర్ శ్రమలు గుర్తుకురాకపోవటం వింతేమీ కాదు. అది ఆయన కులం పరిమితి. మాదిగపిల్ల శీర్షిక పెట్టి మాలపిల్ల కథ చెప్పటం చలం అసం బద్ధ వస్తువిజ్ఞతకే చెల్లింది! అప్పారావు, శ్రీశ్రీ, చలంలకున్న పరిమితులను చూడనీయకుండా బ్రాహ్మణ, కోస్తాంధ్ర సాహిత్యకారులు వారికి మహిమలు అంటగట్టే ప్రయత్నా లు మానుకుంటే అస్తిత్వప్రవాహాల ప్రజాస్వామ్యానికి మేలు చేసినవారవుతారు. అడుగుజాడలని, మహాకవులని, స్త్రీవి ముక్తి నిర్దేశకులని కోస్తా బ్రాహ్మణ కవులను పొగుడుకోవటం దురదృష్టకరం. దేశంలో మెజారిటీ అయిన అణాగారిన జాతుల జీవితాలను వస్తువుగా స్వీకరించని బ్రాహ్మణ రచయితలను ఆకాశానికెత్తటం ప్రజాస్వామ్యానికే విఘాతం. అప్రజాస్వామిక, నిరంకుశ సాంస్కృతిక ధోరణులను బలపరుస్తున్న కమ్మ, రెడ్డి, సాహిత్యకారుల తీరు మారాలి. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, మాదిగ, దళిత, ముస్లిం, బహుజన వాదాల రచయితలు మేల్కొని ఉండి సాహి త్యంలో పాత పల్లకీల మోతను గట్టిగా వ్యతిరేకించాలి. సమానత్వాన్ని కోరే అస్తిత్వ ఉద్యమాలను ఎదగనివ్వడమే నేటి సాహిత్య ప్రజాస్వామ్యం. ఆధిపత్య కులవాదులు తమ కొమ్ములు కత్తిరించుకోడానికి సిద్ధం కావాల్సిందే. కాదంటే సౌహ్రార్దతకు తావు లేని సాహిత్యానికి చదువురులూ శ్రోతలూ మిగలరు. - కృపాకర్ మాదిగ
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
Wednesday, February 25, 2009
భారతీయులు స్వాభిమాన చింతనులేనా?
ఆస్కార్ అవార్డుల పంట పండిం దని సంబరపడుతున్నారే తప్ప, స్లమ్ డాగ్... టైటి ల్ భారతీయులందర్నీ కుక్కలుగా భావించి, అవమానించేదిగా ఉందని రాష్టప్రతి, ప్రధాని మొదలు రాజకీయ ప్రముఖులు దాకా గాని, సినిమా రంగ ప్రముఖులు మొదలు సామాన్య ప్రేక్షకుల వరకు గాని ఒక్క భారతీయురాలైనా, భారతీయుడైనా ఆలోచించకపోవటం మనమెంత భావదారిద్య్రంలో, భావ దాస్యంలో ఉన్నామో అర్థం కావటం లేదా? అద్దం పట్టడం లేదా? స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా భారత దేశంలోని మురికివాడల కథనాన్ని తెరకెక్కించింది. ఇది ఆహ్వానించదగినదే. మన దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో. పట్టణాలన్నీ మురికి వాడలు, పేదల బస్తీలతోనే నిండి ఉన్నాయి. ఈ బస్తీలలో వ్యధాభరిత జీవితానుభవాలున్న వారందరూ మేధావులే. ప్రతియువతీ, ప్రతి యువకుడూ బస్తీ మేధావే. ఇలాంటి మేధావులని... డాగ్... గా, స్లమ్ డాగ్...గా కించపరిచే టైటిల్ పెట్టి ప్రచారం చేస్తూ, కాసుల వ్యాపారం చెయ్యటం సాంఘి క నేరం కాదా? సాంస్కృతిక నేరం కాదా? అగ్రరాజ్య సాంస్కృతిక ఆధిపత్యానికి బుద్ధిలేకుండా జై కొట్టడం కాదా?
ఇంతకీ బస్తీ కుక్క ఎవరు? హీరోనా? భారత దేశంలోని మురికి వాడల వాసులందరూనా? భారతీయ ప్రేక్షకులందరూనా? భారతీయ రచయిత రాసిన `క్యూ అండ్ ఏ' నవల శీర్షికను `బస్తీ కుక్క కరోడ్‌పతి'గా చిత్రీకరించటం పునర్ముద్రణకు సిద్ధం కావటం వెనక ఉన్న ఉద్దేశ్యాలేమిటి? చూస్తూ ఉండగానే జేబులు లూఠీ చెయ్యటమా? భారతీయుల వేళ్ళతోనే వారి కళ్ళను, మనసులను పొడిపించి నొప్పించడమా? మన మహానగరాల పాలకులు వలస పాలకులు పెట్టిపోయిన వీధి పేర్లనే పూర్తిగా తొలగించుకోలేకపోయారు! ఎవరో పెట్టిన సినిమా టైటిల్‌ని ఏం మార్చగలం అని అనుకుంటున్నామా? ఇలాగని సరిపెట్టుకుందామా? సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నిం చకుండా బతుకుదామా?
ప్రశ్నలకి సమాధానాలు సరిగ్గా చెప్పే కురక్రారంతా కుక్కలెలా అవుతారు? వలసవాద, జాత్యహంకార సినిమా పెట్టుబడి సడెన్‌గా ఈ సినిమాకి ఇన్ని ఆస్కార్ అవార్డులో ఎందుకిచ్చింది? వందకోట్ల పై చిలుకు ప్రేక్షకుల మార్కెట్ పై లాభాల వల విసిరేందుకు కాదా? భారతీయ మురికివాడలంటే దళితులు, ఆది వాసులు, అణగారిన సామాజిక వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలే. ఇలాంటి వర్గాల ఇతివృత్తం కలిగిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డులు అందుకున్నది మాత్రం పైకులాల సినిమా నిపుణులే కావటం విచిత్రం, విషాదం. మురికివాడల్లో నివసించే వాళ్ళు కేవలం కుక్కలేనా? మనుషులు కారా? ఈ సినిమా టైటిల్ తెల్లజాతి దురహంకారానికి, వారి తొత్తులైన భారతీయ ఆధిపత్య కులాల సినిమా వ్యాపారులందరి దురహంకారానికి నిదర్శనం కాదా?

వందేళ్ళ సినిమా చరిత్ర కలిగిన ఇండియన్ సినిమాలో ఎన్నో గొప్ప సినిమాలున్నాయి. ఇవి ఆస్కార్ అవార్డుల కమిటీ కళ్ళకు ఆనవా? రంగ్ దె బసంత్, లగాన్, భగత్‌సింగ్ పై తీసిన సినిమాలు, ఇళయరాజా లాంటి సంగీత రాజాలను ఆస్కార్ అవార్డుల కమిటీ చూడదా? (రెహమాన్‌కి, బస్తీ కుక్క...ల సినిమా బృందానికి ఆస్కార్ అవార్డులు ఇవ్వొద్దని కాదు) ఇప్పుడే, ఇలాంటి ఇండియన్ `బస్తీ కుక్క ...'లకే అవార్డులు ఎందుకు కురిపిస్తున్నట్లు? ఇండియన్ ప్రేక్షకులందరూ తమని అవమానించే టైటిళ్ళతో భవిష్యత్తులోనూ రాబోయే సినిమాలను సైతం చప్పట్లు, కేరింతలతో వెర్రివారై... కుక్క...లై చూడాలనా? అగ్ర రాజ్యాల నగరాల్లోని మురికివాడల ప్రజలకి ఇలాంటి కుక్క పేర్లు తగిలించి ఎవరైనా సినిమాలు తియ్యగలరా? అలా తీస్తే ఊరుకోం కదా? వివక్షలకు వ్యతిరేకంగా భారతీయులు ఎవరైనా సినిమాలు తీస్తే, ఆర్టు సినిమాలుగా ముద్రవేసి కలెక్షన్ల దగ్గర కుప్ప కూల్చేయడం సినిమా వ్యాపారానికి పాత విషయమే కాని, అగ్ర రాజ్యాల్లో ఉండేవారు ఇలాంటి సినిమాలు తీస్తే, ఇండియన్ మీడియా విశేషమైన ప్రచారాన్ని ఎందుకు కల్పిస్తోంది? ఇది సిగ్గుచేటు అంశం కాదా? ఒక విదేశీ సాంస్కృతిక సామ్రాజ్యావాద సినిమాని ఇండియన్ ప్రేక్షకులు ఎగబడి చూసే వారిగా ప్రభావితం చెయ్యటం పెట్టుబడి మీడియాకి న్యాయ సమ్మతం కాదు. ఏది ఏమైనా, ఈ సినిమా టైటిల్ భారతీయులందరి ఆత్మాభిమానాన్ని అవమానించేదిగా ఉంది. పోరాడి ఈ టైటిల్‌ని మార్చుకోక పోతిమా, దేశమే కుక్కగా మారిపోయే ప్రమాదముంది జాగ్రత్త!
- కృపాకర్ మాదిగ, జూపాక సుభద్ర
( సుర్య దినపత్రిక 26-2-2009 సౌజన్యంతో)
Friday, February 20, 2009
అభిమానులకు విజ్ణప్తి
మాదిగ సాహిత్యంపై పరిశోధనలు, పుస్తక ముద్రణలు సీరియస్ గా విస్తృతంగా జరుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఏకైక, అత్యధిక (పది శాతం) జనాభాతో మాదిగ కులం ఉంది. అందుకని ’సింహభాగం జనాభా మాది.సింహభాగం తెలుగు సాహిత్యమూ మాదే ’అని నిరూపించేదిశగా మాదిగ సాహిత్యం వెలువడుతుంది. ఒక ఉధ్యమంగా జరుగుతున్న మా కృషికి ఆర్థిక, హార్థిక సహకారాన్ని అందించ వలసినదిగా మాదిగ సాహిత్యాభిమానులను కోరుతున్నాము.
Saturday, February 14, 2009
Thursday, February 12, 2009
మాదిగ డైరెక్టరీ కోసం విఙ్ఞప్తి!
మాదిగ డైరెక్టరీని అచ్చు వెయ్యదలిచాం. మాదిగ విద్యావేత్తలు, రచయితలు, కవులు, జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులు, శిల్పం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ,గానం, చిందు, క్రీడలు, వాయిద్యం, వృత్తి కళ ( చెప్పులు కుట్టుట)మొదలైన అంశాలలో ప్రవేశమున్న మాదిగలు వారి విద్య, పరిశోధన, అనుభవం, పొందిన అవార్డులు, సన్మానాలు,ముద్రిత, అముద్రిత గ్రంథాలు అడ్రసు, ఫోను/సెల్ నంబర్లు , ఇ-మెయిల్ ఐడి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో జతపరిచి ఈ కింది ఇ-మెయిల్ కి గానీ, లేదా కింది చిరునామాకి గానీ పంపగలరు.
krupakarmadiga@gmail.comAddress:
Krupakar Madiga
13-6-462/A/27
Bhagavandas Bagh,
Tallagadda, Hyderabad-500067
A.P., India
Sunday, January 25, 2009
మనలో 'మన'మున్నామా? ( Andhra Jyothy 26-1-2009)
చరిత్రలో మాకు జరిగిన జరుగుతున్న రకరకాల మోసాల అనుభవాలున్న కారణంగా ఉమ్మడి రచయిత్రుల వేదిక పట్ల సంశయంతోనే 'మనలో మనం' సభలకు (జనవరి 10, 11 విశాఖపట్నం) వెళ్లడం జరిగింది. ఈ రెండు రోజులు కూడా స్త్రీ సాహిత్యం దళిత-బి.సి-గిరిజన -ముస్లిం స్త్రీలను పట్టించుకోలేదని, కలుపుకోలేదని, వారి సాహిత్యాన్ని కుక్క ముట్టిన కుండలాగానే దూరం బెట్టిందనే అవగాహనతో చర్చ ప్రారంభించాం. 'స్త్రీవాద' సాహిత్యం ప్రధానంగా కోస్తాంధ్ర ఆధిపత్యకులాల నుంచే వచ్చింది. దాని ఉధృతి పెరిగినా తగ్గినా దళిత బి.సి. మైనారిటీ రచయిత్రులకేం తరిగింది ఒరిగిందిలేదు. దళిత, బి.సి, ముస్లిం స్త్రీలకు కులం, శ్రమ, మతం, మగాధిపత్యం అణచివేతలు చుట్టుముట్టివున్నాయి.
కొద్దిమంది ఆధిపత్య కులాల స్త్రీలు జెండర్ ప్రాతిపదికన ఒకే అస్తిత్వం ఏకపక్షంగా ప్రకటించుకోవడం మాకు అభ్యంతరం. స్త్రీలంతా ఒకటి కాదు. కుల, మత, ప్రాంత అస్తిత్వాలతో ఎవరి కులాల్లో, ఎవరి శిబిరాల్లో ఎవరి పొయిలు వారికున్నయి. వారి సమస్యలు ప్రత్యేకంగా ఉన్నాయి. స్త్రీలంతా ఒక్కటే అనడం వల్ల స్త్రీలల్లో వున్న అసమానతల్ని వారి అస్తిత్వాల్ని మాట్లాడనివ్వకుండా అవగాహన చేస్కోలేని అప్రకటిత సెన్సార్‌షిప్‌లకు గురిచేసే, గురయ్యే ప్రమాదముంది. తద్వారా స్త్రీ సాహిత్యం అసమగ్రం అవుతుంది. ఈ సభల్లో ప్రధానంగా చర్చ జరిగింది దళిత, బి.సి, ముస్లిం స్త్రీల జీవితాల చుట్టూ ఆవరించిన ఆకాంక్షలకి, అభివృద్ధికి సాహిత్యం చేసిన కృషి, సేవ ఏమీలేదనే! వారి అనుభవాలు, సంఘర్షణలు, శ్రమదోపిడి, కుల దోపిడి, వారెదుర్కొంటున్న మగ వాదం దిశగా చర్చ జరగాలి అనే దాని చుట్టూ సభ స్పందించింది.
దళిత బి.సి. ముస్లిం స్త్రీల అస్తిత్వాలకు సంబంధించిన అధికార రాజకీయాల్ని ఏ మేరకు గుర్తిస్తున్నారు, అవి ఏ మేరకు సాహిత్యంలో భాగమయ్యాయి? రచయిత్రులకు ఉమ్మడి వేదిక కావాలనుకుంటే ముందుగా కోస్తాంధ్ర ఆధిపత్య కులాల స్త్రీల రచనలకు పరిమితమైన 'స్త్రీవాద' పదం, విస్తృతమైన-మెజారిటీగా వున్న-అణగారిన దళిత బి.సి. ముస్లిం గిరిజన స్త్రీల సాహిత్యానికి సరిపోదు, యిమడదు. అందుకే ఆ పదం పట్లనే మాకున్న అభ్యంతరాల్ని సభ ఆమోదించింది. ఇకమీదట దళిత స్త్రీవాదం, ముస్లిం స్త్రీవాదం అని మా సాహిత్యాన్ని సంబోధించొద్దు.
ఆ 'స్త్రీవాదం' అనే పదం లేకుండా దళిత మైనారిటీ బి.సి స్త్రీల విస్తృతి ప్రాతిపదికన ఒక కొత్త పదాన్ని రూపొందించుకోవాలనే మా అభ్యంతరంపై సభ ఆమోదం తెల్పింది. ఒకరిద్దరు ఆధిపత్య కులాల విప్లవ సంఘాల రచయిత్రులు ఈ కులాలు, అస్తిత్వాల కంటే శ్రమ స్త్రీల నుంచి సాహిత్యం రావాలి అన్నారు. ఆ విషయంతో మేము తీవ్రంగా విభేదించి శ్రమ-కులం వేరువేరుగా లేవు. కులమే శ్రమగా వ్యవస్థీకృతమైంది. కులమనేది పుట్టుకతోనే సంఘబానిసల్ని తయారు చేసింది భారతదేశంలో. కులమనేది శ్రమ విభజననే కాదు శ్రామికుల మధ్య విభజనను కూడా సృష్టించిందనే వాస్తవాన్ని తెలుసుకోవాలనే వాదన పెట్టాం. దాని చుట్టూ జరిగిన చర్చలో 'శ్రమ స్త్రీలు' ప్రత్యేకం అనే వాదం వీగిపోయింది.
ఇక వాకపల్లి వెళ్లడాన్ని ఉద్యమ యాత్రగా చెప్పటంపైన మా అభ్యంతరం వాళ్లకు స్వీపింగ్ కామెంట్లా కనిపించింది. వాకపల్లి వెళ్లి అరకు చూసిరావడాన్ని ప్రశ్నించడం వారికి మింగుడుపడలేదు. గుజరాత్ వెళ్లేప్పుడు ముస్లిం స్త్రీలు ఎందుకు కనిపించలేదు? అన్న ప్రశ్నకు జవాబులేదు. చుట్టూ ఇంత క్షోభ, ఇంత పోరాటం, ఇంత వస్తువు, ఆత్మహత్యలు, హత్యలు, అవమానాలు ఇన్ని జరుగుతుంటే మీరు మళ్లీ రామాయణ మహా భారతాల్లోకి వెనక్కి వెళ్లి రాయడం వస్తు రాహిత్యమా? బాధ్యతా రాహిత్యమా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు.
పక్కనే ఉన్న సిరిసిల్లలో ఇన్ని ఆత్మహత్యలు జరుగుతుంటే ఎందుకు వెళ్లలేదంటే సమాధానం లేదు. దళిత బి.సి. ముస్లిం స్త్రీలు ఇంత విస్తృతంగా రాస్తుంటే, భాష అడ్డమొచ్చిందనో యాస అర్ధం కావట్లేదనో వంకలు పెట్టి వీరి సాహిత్యాన్ని దూరం ఉంచారు సరే, కనీసం అక్షర రూపంలో దాడి జరుగుతుంటే సపోర్టు కూడా ఇవ్వలేదు, ఎందుకు? అన్న ప్రశ్నకూ సమాధానం లేదు. ఇక వీరిలో నవలా రచయిత్రి ఒకరు 'ముద్దు పెట్టుకుంటున్న సమయంలో నేను స్త్రీనో పురుషుణ్ణో మరచిపోతాను... మనం రాసేదంతా కల్పనే కదా' అనడం అస్తిత్వవాదాలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లే కదా!
సాహిత్యమంతా కల్పనే అనే ప్రమాదకర స్టేట్మెంట్ ఇచ్చినట్లవుతుంది కదా! కథా రచయిత్రి ఒకరు 'బ్రాహ్మణ ఇళ్లల్లో పనిచేస్తారు, వాళ్లిచ్చినవి తింటారు, మా ఇళ్లల్లో పని చేయరు, మేమిచ్చినవి గోడవతల పడేస్తారు' అని దళితుల గురించి మాట్లాడారు. ఇలాంటి భావజాలాలతో నిండి ఉన్న మనస్సులు, మనుషులతో ఎలా కలిసిపోతాం? నిలువెత్తు గోడలు కట్టుకుని కూర్చుని 'మనలో మనం' అనడం ఎంతవరకు సబబు? అనిపిస్తున్నది.
అగ్రవర్ణ పురుషాధిపత్యాన్ని ప్రశ్నించడం వరకే పరిమితమైన స్త్రీవాద సమూహం, మెజారిటీగా ఉన్న బి.సి, దళిత, మైనారిటీ స్త్రీల సమస్యలపై ఏనాడు స్పందించింది లేదు. వారి సమస్యలపట్ల అంటీముట్టనట్లుగా ఉండటమే కాక దళిత రచయిత్రులు లేవనిత్తిన ప్రశ్నలకు కూడా వీరి వద్ద సమాధానాలు లేవు. కుల వివక్ష గురించి, మత దాడుల గురించి వీళ్లు మాట్లాడింది లేదు.
అదేదో తమకు సంబంధించని విషయంగానే చూస్తూ వస్తున్నారు. ముస్లిం రచయిత్రుల భాషపట్ల వచ్చిన విమర్శ కూడా తెలిసిందే. ముస్లిం స్త్రీలు తమ మతం వల్ల గురయ్యే హింస గురించి రాసినపుడు సపోర్టు చేసినంతగా హిందూత్వవాదుల దాడుల గురించి రాసినదాని పట్ల మౌనంగా ఉండటం గమనించవచ్చు. అలాగే స్త్రీవాదులెప్పుడూ ప్రజాస్వామికోద్యమమైన ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చింది లేదు. మరో ప్రజాస్వామిక ఉద్యమమైన మాదిగ దండోరా పట్ల కూడా మద్దతు ప్రకటించలేదు. మరి వీరెలా ప్రజాస్వామికవాదులవుతారు? ఉమ్మడి వేదికను చారిత్రక ఘట్టంగా వర్ణిస్తూ, 'మేమే చేశాం' అని చెప్పుకోవడానికే మమ్మల్ని ఆహ్వానించినట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే ఇంతకు మునుపు వీళ్లెవరూ అస్తిత్వ వాదాల గురించి మాట్లాడటం, రాయడం చేయలేదు. కదులుతున్న నీలిమేఘాలు ఎవరిని కబళించాలని? ఉరుముతున్న నల్లమబ్బుల మీద వీరికి ప్రేమ లేదు. పైగా మా జాతుల మీద ప్రేమ లేని రచనలూ వీరి పుస్తకాల్లో చూడొచ్చు. ఉన్న గ్యాప్స్‌ని కొత్త ఋతువుల కింద పూడ్చేయాలని చూస్తున్నారా? అస్తిత్వాల గొంతు నొక్కేయాలనుకుంటున్నారా? ఇంకా ఇలాంటి అనేకానేక కారణాల వలన, 'స్త్రీవాదం'తో మేము మమేకం కావడం వల్ల మా అస్తిత్వాల్ని వారు మింగేసే ప్రమాదం ఉండొచ్చని భావిస్తున్నాం.
మా ప్రత్యేక అస్తిత్వాల్ని గుర్తించ నిరాకరించే 'స్త్రీవాదులు' మా వాదాల్ని, వాదనల్ని గౌరవించనపుడు వారితో కలిసి పని చేయడం ప్రశ్నార్థకమవుతుంది. మా భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినవారమే అవుతాం. మా సందేహాలకు, సంశయాలకు స్పష్టమైన సమాధానాలు దొరికితే ఉమ్మడి వేదిక సాధ్యం కావొచ్చేమో! లేకపోతే మా పోరాటం మేము ఎలాగూ చేస్తూనే పోతాం.
- జూపాక సుభద్ర, షాజహానా

Saturday, January 24, 2009
MADIGA RESERVATION PORATA SAMITI
Andhra Pradesh
13-6-462/A/27, Bhagavandasbagh, Tallagadda, Hyd – 500 067. Cell: 99483 11667, krupakarmadiga@gmail.com
Krupakar Madiga P.
State President
ToAndhra Pradesh
13-6-462/A/27, Bhagavandasbagh, Tallagadda, Hyd – 500 067. Cell: 99483 11667, krupakarmadiga@gmail.com
Krupakar Madiga P.
State President
New Delhi,
20-12-2008
Dr.Manmohan Sing ji,Prime Minister of India,
New Delhi
Sub: Rationalisation of SC reservation in AP – Introduction of Bill in Parliament – Req. – Reg.
Respected Sir,
Distribution of SC Reservation opportunities to all the 59 castes of SCs proportionately, based on their population, has been the demand and struggle of Madigas (Charmakars) and Rellies (Manual Scavengers) of Andhra Pradesh, for the last 30 years.
Recently, Justice Usha Mehra Commission constituted by the Govt of India, also recommended for rationalization (categorization) of SCs in AP by amending Article 341 of the Constitution.
There is an urgent need for providing equal distribution of reservation benefits to all communities of SCs at least in the forthcoming academic year. To this extent, there is a need for the Parliament to make an Act immediately.
In the light of above, we request you to kindly initiate the process of amending Article 341 of the Constitution in the present winter parliament session.
Thanking you Sir,
Yours sincerely
(P. Krupakar Madiga)
Friday, January 23, 2009
అవకాశంలో సగభాగం ( జూపాక సుభద్ర తో సూర్య దినపత్రిక 23-1-2009 ఇంటర్వ్యూ)

మంచి అవకాశం వస్తే అప్పటికప్పుడు ఎంతటి బాధ్యతనైనా నిర్వర్తించడానికి తయారవుతున్నారు నేటి మహిళలు. అప్పటి వర కూ ఉద్యోనిగా, రచయితగా ఉన్న సెక్రటేరి యేట్ ప్రభుత్వ కార్యదర్శి జూపాక సుభద్రకూ ఇలాంటి ఓ సదవకాశం దక్కింది. ఈనెల 24న జరగనున్న సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్ని కల్లో ఆమె మొదటి మహిళా అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ప్రఖ్యాత తెలంగాణ వాద రచయితగా ఆమె అందరికీ సుపరిచితమే. ఉద్యోగుల, మహిళా సంక్షేమమే తన ధ్యేయమంటోన్న సుభద్రతో ధీర ఇంటర్వ్యూ...
..............
మీకీ అవకాశం ఎలా వచ్చింది?
రచనల ద్వారా నా అంతరంగ భావాలను గుర్తించిన ఉద్యోగులు నన్ను బరిలో దిగటానికి ప్రోత్సహించారు. నాదంతా తెలంగాణా దళిత నేపథ్యం. నేను స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చాను. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం దాకా అన్ని విద్యార్థి నాయకత్వ కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ఎం.ఫిల్ చేస్తుండగా సచివాలయ, సర్వీసులో సహాయ విభాగ అధికారిగా 1988లో చేరాను. ప్రస్తుతం సహాయ కార్యదర్శిగా గృహనిర్మాణ శాఖలో విధులు నిర్వహిస్తున్నాను.
సచివాలయంలో మార్పులు తీసుకురావడానికి మీరు ఎలాంటి పాత్ర నిర్వర్తించారు?
సచివాలయంలో దాదాపు 3,600 మంది ఓటర్లు ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘంలో మహిళలకు ప్రాతినిధ్యం లేని పరిస్థితులుండేవి. 1991లో అదనపు కార్యదర్శిగా పోటీ చేసి గెలిచిన మొదటి మహిళగా గుర్తింపు సాధించాను. అదే సంవత్సరం మహిళా ఉద్యోగుల కోసం సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం స్థాపించాను. దీని ద్వారా మహిళల్లో నాయకత్వ లక్షణాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రసూతి సెలవులను నాలుగు నెలలకు పొడగించడం, ఉద్యోగిణులకు ప్రత్యేక బస్సు సౌకర్యం, వంట గ్యాస్ ఉదయం పది గంటలకు ముందు, సాయంత్రం ఐదు గంటల తరువాత ఉద్యోగులకు సరఫరా చేసే విధంగా జీవోలు సాధించుకున్నాం. వీటన్నింటికి బాధ్యత నేనే వహించాను.
ఉద్యోగిణులు ఉన్నత నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారని మీరు భావిస్తున్నారా?
స్త్రీకి నాయకత్వం వహించే సంపూర్ణ స్వేచ్ఛ ఇంకా లభించలేదు. కుటుంబ చట్రం, ఆర్థిక, సామాజిక, జెండర్ అణిచివేతలు ఇవన్నీ మహిళకు నిరంతర సవాళ్లుగా ఎదురవుతున్నాయి. అందుకే మహిళ ఉన్నత నాయకత్వాన్ని అందుకోలేకపోతుంది.
మరి నాయకత్వ స్థానాల్లో ఎదగటానికి అధిగమించవల్సిన అంశాలేమిటి?
న్యూన్యతని వదులుకోవాలి. ఆత్మ విశ్వాసాన్ని, చొరవని ప్రదర్శించాలి. ప్రోత్సాహాన్నందించే సామాజిక, కుటుంబ వాతావరణం కూడా పెరగాలి.
అధ్యక్ష్యురాలిగా గెలిస్తే?
ముందుగా ఖాలీ ఉద్యోగాలని భర్తీ చేస్తాను. పని భారానికి సరిపోయే కొత్త పోస్టులకోసం, ప్రమోషన్స, అవకాశాలు, స్పోర్ట, కల్చరల్ గ్రాంట్‌స పెంపు కోసం కృషి చేస్తాను. స్థలాలు, ఇళ్ల నిర్మాణంలో ఉద్యోగులందరికీ బాధ్యతాయుతమైన న్యాయమందిచడం కోసం కృషి చేస్తాను. వైద్య సదుపాయాల కోసం నిధుల పెంపు, క్యాంటీన్ ధరల తగ్గింపు.... ఇతరత్రా కార్యక్రమా లను పారదర్శకతతో నిర్వర్తిస్తాను.
ఉద్యోగిణులకు మీరిచ్చే విజన్ ఏమిటి?
నాయకత్వ స్థానాల్లో అన్నిచోట్ల పురుషులతో సమానంగా ఎదగాలి. అన్ని రకాల అవకాశాల్లో సగం వాటా మహిళలు పొందాలి. వివక్షకు తావులేని సమాజం కోసం మహిళా నాయకత్వాన్ని వారి సాధికార శక్తిని నిరంతరం పెంచుకోవాలి.
( సూర్య 23-1-2009 సౌజన్యంతో)
Subscribe to:
Posts (Atom)