సమాజం దళిత స్త్రీలను ఎలా చూసిందో చలం కూడా అలాగే చూశాడు. స్త్రీల ప్రత్యేక సమస్యలను పట్టించుకోకుండా కేవలం అగ్రకులాల దురాచారాలను సంస్కరించుకున్నాడు. క్రిందికులాల్లో ఉన్న సామాజిక రుగ్మతలు ఆయనకు పట్టలేదు. ఆయనకు కుల స్పృహ లేదనడానికి నిదర్శనం 'మాదిగమ్మాయి' కథలో ఆయన మాలమ్మాయిని వర్ణించడం. అగ్రకుల మహిళల పురోగతికి ఆటంకంగా ఉన్న రుగ్మతలమీద పోరా డి అదే సామాజిక సంస్కరణని అనుకుంటే ఎలా? జెండర్‌మీద సామాజిక ఆధిపత్యం గురించి చెప్పాడు సరే. కులం ఇంకా బలమైనది కదా? రచయితకు సామాజిక దృక్పథం ఉండాలి కదా? అందువల్ల ఆయనను మోయాల్సిన అవసరం మాకు లేదు. అయితే, చలం స్త్రీని చాలా సున్నితంగా చూడడం మనకు నచ్చుతుంది. మహిళ విముక్తికోసం, స్వేచ్ఛకోసం, జెండర్ వివక్షకు వ్యతిరేకంగా ఆయన యుద్ధమే చేశాడు. ఆ పోరాటం చిన్నది కాదు. ఆయన లైంగికస్వేచ్ఛ మాత్రమే చెప్పాడని నేను అనుకోను.
- -జూపాక సుభద్ర
(ఆంధ్ర జ్యోతి 19-05-2008)
No comments:
Post a Comment