Friday, September 4, 2009
Monday, June 29, 2009
అస్తిత్వ సాహిత్యాలను ఎదగనివ్వడమే నేటి ప్రజాస్వామ్యం
గురజాడ, చలం, శ్రీశ్రీ శత జయంతి, వర్ధంతి కార్యక్రమాలను, సంస్మరణ ప్రత్యేక సంచికలను, ప్రత్యేక కథనాల ప్రసారాలను ముమ్మరం చేసారు. ఇదంతా రచనా రంగంలో ఆధిపత్య కులాల పెత్తనాలను కాపాడుకునే ప్రయత్నాలే! తెలుగులో అస్తిత్వ సాహిత్యాలు బలంగా ముందుకు సాగుతున్నాయి. మాదిగ, దళిత, ముస్లిం, దళిత క్రైస్తవ, తెలంగాణ, బిసి సాహిత్యాలు ఇందుకు నిదర్శనం. మాదిగ సాహిత్య వేదిక, దండోరా- మైసమ్మ- ఏకలవ్య ప్రచురణలు, గుంపు సాహితి, భాగ్యనగర్ బుక్‌ట్రస్టు లాంటి అనేక ప్రచురణ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇపుడు మరో అడుగు ముందుకుపోయి ఎస్సి ఎస్టి బిసి మైనారిటి రచయిత్రుల వేదిక 'మట్టిపూలు' పరిమళం మొదలైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ సాహిత్యం వస్తూనే ఉంది. ఈ సాంస్కృతిక పునర్జీవనం కోస్తాయేతర ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణ కేంద్ర బిందువుగా సాగుతోంది. అలాగే అణగారిన అన్ని సమూహాల్లో ఈ పునర్జీవనం ప్రారంభమయ్యింది. అణగారిన కులం జాతి-తెగ-జెండర్-మతం- భాష- ప్రాంతాలకు చెందిన చైతన్యంతో వస్తున్న రచనలవల్ల బ్రాహ్మణ,శూద్ర ఆధిపత్యకులాల గుత్తనాయకత్వం, పట్టు క్రమంగా తగ్గిపోతోంది. అస్తిత్వ సాహిత్వాల ప్రతిఘటన ను, సవాళ్లను ఆధిపత్యకుల రచయితలు, వారి అభిమాను లు జీర్ణించుకోలేకపోతున్నారు.స్వాగతించలేకపోతున్నారు. దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, బిసీల జీవితాలను స్పృశించని కోస్తా బ్రాహ్మణ రచయితలు గురజాడ, శ్రీశ్రీ, చలం మొదలగువారిని బహుజన సమూహాలన్నింటికి సాహిత్య ప్రతినిధులుగా రుద్దే కుట్రలు జరుగుతున్నా యి. అనేకానేక పరిమితులున్న వారిని ప్రగతిశీల, అభ్యుదయ, ఆధునిక, విప్లవ సమగ్రతల మహత్తులు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి గొప్పతనం 'అనంత'మైనద ని ఆధిపత్య కులాల రచయితలు అంటున్నారు. భవిష్యత్ తరాలకు కూడా సమకాలికుడు గురజాడ అనీ, ముద్దుల గురజాడ అని, కన్యాశుల్కం - శ్రీశ్రీ శత జయంతి సందర్భాన్ని 'ఒకే ఆకాశంలో రెండు పున్నము'లని, జీవజలం చలం అనీ పాళీలు అరిగిపోయేలా పొగడ్తలు రాసేస్తున్నారు. వీరి శత జయంతి, వర్ధంతి కార్యక్రమాలను, సంస్మరణ ప్రత్యేక సంచికలను, ప్రత్యేక కథనాల ప్రసారాలను ముమ్మరం చేసారు. ఇదంతా రచనారంగంలో ఆధిపత్య కులాల పెత్తనాలను కాపాడుకునే ప్రయత్నాలే! నేటికీ ఆధిపత్య కులాలే పురోహిత, విద్య, పరిపాలన, సాంస్కృతిక, ఆర్థిక వ్యవస్థలను నియంత్రిస్తున్నాయి. వారసత్వం, భూమి (ధనం), కులంతో సమాజంపై పట్టు నిలుపుకునే ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాయి. బహుజన సమూహాలపై సాంస్కృతిక దాడిని సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ఆధిపత్య కులాలు కొనసాగించే దుశ్చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అస్తిత్వ ఉద్యమాల సంరంభాన్ని తెరమరుగుపరచటానికి ఆధిపత్యకులాలరచయితలు వొడి గడుతున్నారు. అస్తిత్వ ప్రవాహాలను అప్రధానం, అదృ శ్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నారు. మాదిగ, ముస్లిం, తెలంగాణ, బహుజనవాద రచయితలను గందరగోళపరి చి అస్తిత్వవాదాలనుండి మరలించి సాహిత్య రాజకీయా ల్లో పాలేర్లు (కార్యకర్తలు)గా, కోవర్టులుగా ఉపయోగించుకుంటున్నారు. కొన్ని సాహిత్య వేదికల ఏర్పాటు ఇందులో భాగమే. అప్పారావు, శ్రీశ్రీ, చలంలకు ప్రగతిశీల, అభ్యుదయ, విప్లవ ముద్రలు వేసి, పరోక్షంగా బ్రాహ్మణ రచయితల్లో గొప్పతనం ఉందనిచెప్పే మోసం జరుగుతున్నది. బ్రాహ్మణ రచయితలు గొప్పవారని ప్రచారం చేసి, తర్వా తి వరసలో శూద్రాధిపత్య కులాల ఆధిక్యతలను సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో స్థాపించుకునే దుర్నీతి ఇది. 'మంచియన్నది మాలయైతే, మాల నేనగుదున్' అన్నా డు గురజాడ. అప్పారావు దృష్టిలో మాల మంచిదో కాదో సందేహంగానే మిగిలింది! కన్యాశుల్కం నాటకంలో రామ ప్ప పంతులు అనే బ్రాహ్మణ పాత్ర చేత అసిరిగాడు (దళితుడు) పాత్రని ఉద్దేశించి 'అపవిత్రం ముండాకొడుకు ఏవై నా తింటాడు. బ్రాహ్మలం పవిత్రమైనవాళ్లం గదా' అని కుల వివక్ష ప్రదర్శిస్తాడు. అప్పారావు నేడు బతికుంటే తీవ్ర విమర్శలను ఎదుర్కొని ఉండేవాడు. కాలం చెల్లిన, అమానవీయమైన కన్యాశుల్కం అభ్యుదయ నాటకమని కీర్తించే సాహిత్యాభిమాన శిఖామణులు రాజ్యాంగంలోని అధికరణం 17 అంటరానితనాన్ని నిషేధించిందని, కుల వివక్ష శిక్షార్హమైన నేరంగా గ్రహిస్తే మంచిది. బ్రాహ్మణ బాలిక పూర్ణమ్మ దయనీయస్థితి గురించి రాసిన అప్పారావు, దళిత పాత్ర అయిన అసిరిగాడికి గౌరవప్రదమైన పేరు పెట్టకపోవటం, మానవ హుందాతనం కల్పించలేకపోవ టం, ఆయనలోని బ్రాహ్మణ వివక్ష, అహంకారం కాదా? సాహిత్యయుగాన్ని ఇకపై నేను నడిపిస్తున్నానని గొప్ప లు పోయిన శ్రీశ్రీ కవిత్వంలో 'భూతాలు, యజ్ఞోపవీతా లు' వంటి హిందూ గ్రాంధిక వ్యాకరణ (బ్రాహ్మణ) శబ్దా లు చాలానే ఉన్నాయి. వ్యాకరణంలో చందోబద్దంగా బ్రాహ్మణ రచయితలే రాస్తారు. దానిని తోసిపుచ్చి శ్రీశ్రీ వంటి బ్రాహ్మలే చందస్సు సంకెళ్లని చట్‌ఫట్‌మని తెంచేస్తారు! సాహిత్యంలో గ్రాంధిక రచనా బ్రాహ్మణ్యమైనా, సరళ రచనా బ్రాహ్మణ్యమైనా వారి సొత్తేకాని, బహుజన రచయితల సొత్తు కాదని చెప్పే అహంకార ప్రదర్శన ఇది. ఏ గొప్ప ప్రాధాన్యత, విలువైనా బ్రాహ్మణులకే తప్ప బ్రాహ్మణేతర రచయితలకు కాదనే కుల వివక్ష కూలిపోవాల. ఆఫ్రికా ఖండంలోని 'హాటెన్ టాట్, జూలు, నీగ్రో' లు కనిపించిన శ్రీశ్రీకి రాజకీయ, మానవ హక్కులకోసం దేశంలో దళితులు చేసిన ఏ పోరాటమూ, ఉద్యమమూ కనిపించకపోవటం ఎంత ఆశ్చర్యం! కవితా వస్తువుగా శ్రీశ్రీకి దళిత జీవితం పనికిరాకపోవటం అమానుషం అనిపించడంలేదా? పోనీ, ఇది శ్రీశ్రీ పరిమితి అని అతని అభిమానులు వొప్పుకుంటారా? 'కసాయిబు' తిట్టు పద సృష్టి చేసినందుకు శ్రీశ్రీ అస్తిత్వ చైతన్యం కలిగిన నేటి ముస్లిం రచయితల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సిఉండేది. బ్రాహ్మణ, శూద్రాధిపత్య కులాల స్త్రీల స్వేచ్ఛని రచన ల్లో చిత్రించిన చలానికి బహుజన జెండర్ శ్రమలు గుర్తుకురాకపోవటం వింతేమీ కాదు. అది ఆయన కులం పరిమితి. మాదిగపిల్ల శీర్షిక పెట్టి మాలపిల్ల కథ చెప్పటం చలం అసం బద్ధ వస్తువిజ్ఞతకే చెల్లింది! అప్పారావు, శ్రీశ్రీ, చలంలకున్న పరిమితులను చూడనీయకుండా బ్రాహ్మణ, కోస్తాంధ్ర సాహిత్యకారులు వారికి మహిమలు అంటగట్టే ప్రయత్నా లు మానుకుంటే అస్తిత్వప్రవాహాల ప్రజాస్వామ్యానికి మేలు చేసినవారవుతారు. అడుగుజాడలని, మహాకవులని, స్త్రీవి ముక్తి నిర్దేశకులని కోస్తా బ్రాహ్మణ కవులను పొగుడుకోవటం దురదృష్టకరం. దేశంలో మెజారిటీ అయిన అణాగారిన జాతుల జీవితాలను వస్తువుగా స్వీకరించని బ్రాహ్మణ రచయితలను ఆకాశానికెత్తటం ప్రజాస్వామ్యానికే విఘాతం. అప్రజాస్వామిక, నిరంకుశ సాంస్కృతిక ధోరణులను బలపరుస్తున్న కమ్మ, రెడ్డి, సాహిత్యకారుల తీరు మారాలి. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, మాదిగ, దళిత, ముస్లిం, బహుజన వాదాల రచయితలు మేల్కొని ఉండి సాహి త్యంలో పాత పల్లకీల మోతను గట్టిగా వ్యతిరేకించాలి. సమానత్వాన్ని కోరే అస్తిత్వ ఉద్యమాలను ఎదగనివ్వడమే నేటి సాహిత్య ప్రజాస్వామ్యం. ఆధిపత్య కులవాదులు తమ కొమ్ములు కత్తిరించుకోడానికి సిద్ధం కావాల్సిందే. కాదంటే సౌహ్రార్దతకు తావు లేని సాహిత్యానికి చదువురులూ శ్రోతలూ మిగలరు. - కృపాకర్ మాదిగ
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
Wednesday, February 25, 2009
భారతీయులు స్వాభిమాన చింతనులేనా?
ఆస్కార్ అవార్డుల పంట పండిం దని సంబరపడుతున్నారే తప్ప, స్లమ్ డాగ్... టైటి ల్ భారతీయులందర్నీ కుక్కలుగా భావించి, అవమానించేదిగా ఉందని రాష్టప్రతి, ప్రధాని మొదలు రాజకీయ ప్రముఖులు దాకా గాని, సినిమా రంగ ప్రముఖులు మొదలు సామాన్య ప్రేక్షకుల వరకు గాని ఒక్క భారతీయురాలైనా, భారతీయుడైనా ఆలోచించకపోవటం మనమెంత భావదారిద్య్రంలో, భావ దాస్యంలో ఉన్నామో అర్థం కావటం లేదా? అద్దం పట్టడం లేదా? స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా భారత దేశంలోని మురికివాడల కథనాన్ని తెరకెక్కించింది. ఇది ఆహ్వానించదగినదే. మన దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో. పట్టణాలన్నీ మురికి వాడలు, పేదల బస్తీలతోనే నిండి ఉన్నాయి. ఈ బస్తీలలో వ్యధాభరిత జీవితానుభవాలున్న వారందరూ మేధావులే. ప్రతియువతీ, ప్రతి యువకుడూ బస్తీ మేధావే. ఇలాంటి మేధావులని... డాగ్... గా, స్లమ్ డాగ్...గా కించపరిచే టైటిల్ పెట్టి ప్రచారం చేస్తూ, కాసుల వ్యాపారం చెయ్యటం సాంఘి క నేరం కాదా? సాంస్కృతిక నేరం కాదా? అగ్రరాజ్య సాంస్కృతిక ఆధిపత్యానికి బుద్ధిలేకుండా జై కొట్టడం కాదా?
ఇంతకీ బస్తీ కుక్క ఎవరు? హీరోనా? భారత దేశంలోని మురికి వాడల వాసులందరూనా? భారతీయ ప్రేక్షకులందరూనా? భారతీయ రచయిత రాసిన `క్యూ అండ్ ఏ' నవల శీర్షికను `బస్తీ కుక్క కరోడ్‌పతి'గా చిత్రీకరించటం పునర్ముద్రణకు సిద్ధం కావటం వెనక ఉన్న ఉద్దేశ్యాలేమిటి? చూస్తూ ఉండగానే జేబులు లూఠీ చెయ్యటమా? భారతీయుల వేళ్ళతోనే వారి కళ్ళను, మనసులను పొడిపించి నొప్పించడమా? మన మహానగరాల పాలకులు వలస పాలకులు పెట్టిపోయిన వీధి పేర్లనే పూర్తిగా తొలగించుకోలేకపోయారు! ఎవరో పెట్టిన సినిమా టైటిల్‌ని ఏం మార్చగలం అని అనుకుంటున్నామా? ఇలాగని సరిపెట్టుకుందామా? సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నిం చకుండా బతుకుదామా?
ప్రశ్నలకి సమాధానాలు సరిగ్గా చెప్పే కురక్రారంతా కుక్కలెలా అవుతారు? వలసవాద, జాత్యహంకార సినిమా పెట్టుబడి సడెన్‌గా ఈ సినిమాకి ఇన్ని ఆస్కార్ అవార్డులో ఎందుకిచ్చింది? వందకోట్ల పై చిలుకు ప్రేక్షకుల మార్కెట్ పై లాభాల వల విసిరేందుకు కాదా? భారతీయ మురికివాడలంటే దళితులు, ఆది వాసులు, అణగారిన సామాజిక వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలే. ఇలాంటి వర్గాల ఇతివృత్తం కలిగిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డులు అందుకున్నది మాత్రం పైకులాల సినిమా నిపుణులే కావటం విచిత్రం, విషాదం. మురికివాడల్లో నివసించే వాళ్ళు కేవలం కుక్కలేనా? మనుషులు కారా? ఈ సినిమా టైటిల్ తెల్లజాతి దురహంకారానికి, వారి తొత్తులైన భారతీయ ఆధిపత్య కులాల సినిమా వ్యాపారులందరి దురహంకారానికి నిదర్శనం కాదా?
ఇంతకీ బస్తీ కుక్క ఎవరు? హీరోనా? భారత దేశంలోని మురికి వాడల వాసులందరూనా? భారతీయ ప్రేక్షకులందరూనా? భారతీయ రచయిత రాసిన `క్యూ అండ్ ఏ' నవల శీర్షికను `బస్తీ కుక్క కరోడ్‌పతి'గా చిత్రీకరించటం పునర్ముద్రణకు సిద్ధం కావటం వెనక ఉన్న ఉద్దేశ్యాలేమిటి? చూస్తూ ఉండగానే జేబులు లూఠీ చెయ్యటమా? భారతీయుల వేళ్ళతోనే వారి కళ్ళను, మనసులను పొడిపించి నొప్పించడమా? మన మహానగరాల పాలకులు వలస పాలకులు పెట్టిపోయిన వీధి పేర్లనే పూర్తిగా తొలగించుకోలేకపోయారు! ఎవరో పెట్టిన సినిమా టైటిల్‌ని ఏం మార్చగలం అని అనుకుంటున్నామా? ఇలాగని సరిపెట్టుకుందామా? సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నిం చకుండా బతుకుదామా?
ప్రశ్నలకి సమాధానాలు సరిగ్గా చెప్పే కురక్రారంతా కుక్కలెలా అవుతారు? వలసవాద, జాత్యహంకార సినిమా పెట్టుబడి సడెన్‌గా ఈ సినిమాకి ఇన్ని ఆస్కార్ అవార్డులో ఎందుకిచ్చింది? వందకోట్ల పై చిలుకు ప్రేక్షకుల మార్కెట్ పై లాభాల వల విసిరేందుకు కాదా? భారతీయ మురికివాడలంటే దళితులు, ఆది వాసులు, అణగారిన సామాజిక వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలే. ఇలాంటి వర్గాల ఇతివృత్తం కలిగిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డులు అందుకున్నది మాత్రం పైకులాల సినిమా నిపుణులే కావటం విచిత్రం, విషాదం. మురికివాడల్లో నివసించే వాళ్ళు కేవలం కుక్కలేనా? మనుషులు కారా? ఈ సినిమా టైటిల్ తెల్లజాతి దురహంకారానికి, వారి తొత్తులైన భారతీయ ఆధిపత్య కులాల సినిమా వ్యాపారులందరి దురహంకారానికి నిదర్శనం కాదా?
వందేళ్ళ సినిమా చరిత్ర కలిగిన ఇండియన్ సినిమాలో ఎన్నో గొప్ప సినిమాలున్నాయి. ఇవి ఆస్కార్ అవార్డుల కమిటీ కళ్ళకు ఆనవా? రంగ్ దె బసంత్, లగాన్, భగత్సింగ్ పై తీసిన సినిమాలు, ఇళయరాజా లాంటి సంగీత రాజాలను ఆస్కార్ అవార్డుల కమిటీ చూడదా? (రెహమాన్‌కి, బస్తీ కుక్క...ల సినిమా బృందానికి ఆస్కార్ అవార్డులు ఇవ్వొద్దని కాదు) ఇప్పుడే, ఇలాంటి ఇండియన్ `బస్తీ కుక్క ...'లకే అవార్డులు ఎందుకు కురిపిస్తున్నట్లు? ఇండియన్ ప్రేక్షకులందరూ తమని అవమానించే టైటిళ్ళతో భవిష్యత్తులోనూ రాబోయే సినిమాలను సైతం చప్పట్లు, కేరింతలతో వెర్రివారై... కుక్క...లై చూడాలనా? అగ్ర రాజ్యాల నగరాల్లోని మురికివాడల ప్రజలకి ఇలాంటి కుక్క పేర్లు తగిలించి ఎవరైనా సినిమాలు తియ్యగలరా? అలా తీస్తే ఊరుకోం కదా? వివక్షలకు వ్యతిరేకంగా భారతీయులు ఎవరైనా సినిమాలు తీస్తే, ఆర్టు సినిమాలుగా ముద్రవేసి కలెక్షన్ల దగ్గర కుప్ప కూల్చేయడం సినిమా వ్యాపారానికి పాత విషయమే కాని, అగ్ర రాజ్యాల్లో ఉండేవారు ఇలాంటి సినిమాలు తీస్తే, ఇండియన్ మీడియా విశేషమైన ప్రచారాన్ని ఎందుకు కల్పిస్తోంది? ఇది సిగ్గుచేటు అంశం కాదా? ఒక విదేశీ సాంస్కృతిక సామ్రాజ్యావాద సినిమాని ఇండియన్ ప్రేక్షకులు ఎగబడి చూసే వారిగా ప్రభావితం చెయ్యటం పెట్టుబడి మీడియాకి న్యాయ సమ్మతం కాదు. ఏది ఏమైనా, ఈ సినిమా టైటిల్ భారతీయులందరి ఆత్మాభిమానాన్ని అవమానించేదిగా ఉంది. పోరాడి ఈ టైటిల్‌ని మార్చుకోక పోతిమా, దేశమే కుక్కగా మారిపోయే ప్రమాదముంది జాగ్రత్త!
- కృపాకర్ మాదిగ, జూపాక సుభద్ర
( సుర్య దినపత్రిక 26-2-2009 సౌజన్యంతో)
Friday, February 20, 2009
అభిమానులకు విజ్ణప్తి
మాదిగ సాహిత్యంపై పరిశోధనలు, పుస్తక ముద్రణలు సీరియస్ గా విస్తృతంగా జరుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఏకైక, అత్యధిక (పది శాతం) జనాభాతో మాదిగ కులం ఉంది. అందుకని ’సింహభాగం జనాభా మాది.సింహభాగం తెలుగు సాహిత్యమూ మాదే ’అని నిరూపించేదిశగా మాదిగ సాహిత్యం వెలువడుతుంది. ఒక ఉధ్యమంగా జరుగుతున్న మా కృషికి ఆర్థిక, హార్థిక సహకారాన్ని అందించ వలసినదిగా మాదిగ సాహిత్యాభిమానులను కోరుతున్నాము.
Saturday, February 14, 2009
Thursday, February 12, 2009
మాదిగ డైరెక్టరీ కోసం విఙ్ఞప్తి!
మాదిగ డైరెక్టరీని అచ్చు వెయ్యదలిచాం. మాదిగ విద్యావేత్తలు, రచయితలు, కవులు, జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులు, శిల్పం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ,గానం, చిందు, క్రీడలు, వాయిద్యం, వృత్తి కళ ( చెప్పులు కుట్టుట)మొదలైన అంశాలలో ప్రవేశమున్న మాదిగలు వారి విద్య, పరిశోధన, అనుభవం, పొందిన అవార్డులు, సన్మానాలు,ముద్రిత, అముద్రిత గ్రంథాలు అడ్రసు, ఫోను/సెల్ నంబర్లు , ఇ-మెయిల్ ఐడి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో జతపరిచి ఈ కింది ఇ-మెయిల్ కి గానీ, లేదా కింది చిరునామాకి గానీ పంపగలరు.
krupakarmadiga@gmail.comAddress:
Krupakar Madiga
13-6-462/A/27
Bhagavandas Bagh,
Tallagadda, Hyderabad-500067
A.P., India
Subscribe to:
Posts (Atom)
